జనం పవర్ మాడుగులపల్లి సెప్టెంబర్ 10;
మాడుగులపల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో బుధవారం మండల అధ్యక్షులు పుల్లెంల శ్రీకర్ అధ్యక్షతన డివైఎఫ్ఐ మండల మహాసభ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ హాజరై మాట్లాడుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ రాష్ట్రంలో,దేశంలో నిరుద్యోగ సమస్యలపైన,విద్యారంగా సమస్యల పైన ,అదే విధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని అర్హులైన నిరుద్యోగులందరికీ ప్రతినెలా నిరుద్యోగ భృతి అందించాలని ఉపాధి కల్పన చేపట్టాలని అదేవిధంగా అనేక కార్యక్రమాలు డ్రగ్స్ గంజాయి బెట్టింగ్ యాప్స్ నిర్మూలించాలని సైకిల్ యాత్రలు,రక్తదాన శిబిరాలు,మొక్కలు నాటే కార్యక్రమాలు మరియు స్థానిక సమస్యల పైన పోరాటాలు గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుతం డివైఎఫ్ఐ సంఘం చేయబోయే కార్యక్రమాల్లో నేటి యువత భాగస్వామ్యం కావాలన్నారు.భగత్ సింగ్ ,చేగువేరా కోరుకున్నటువంటి సమసమాజ స్థాపన కొరకు స్వేచ్ఛ సమానత్వం ప్రజాస్వామ్యం కొరకు అహార్నిశలు కృషి చేస్తున్నది కేవలం డీవైఎఫ్ఐ మాత్రమే అనీ కొనియాడారు.ఈ సందర్భంగా నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు.మండల అధ్యక్ష కార్యదర్శులుగా కొడదాల రాంబాబు,ఎలిజాల రమేష్ లను మండల ఉపాధ్యక్షులు,సహాయ కార్యదర్శులుగా గోపి,వెంకన్న,సతీష్ రెడ్డి, లెనిన్ ,సాయి ,తండు రాజు ,బంటు రాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ మహాసభలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్ ,రాష్ట్ర కమిటీ సభ్యులు పతాని శ్రీను,జిల్లా సహాయ కార్యదర్శి కట్టా లింగస్వామి,గుండాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.









