*నేరం చేసిన నేరస్తులు చట్టం నుండి తప్పించుకోలేరు.*
*పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్*
జనం పవర్, సిద్దిపేట, సెప్టెంబర్:10
*నేరస్తుని వివరాలు*
పింగళి నరేందర్ రెడ్డి తండ్రి తిరుపతిరెడ్డి, వయస్సు 45 సంవత్సరములు, నివాసం నవాబుపేట, మండలం చిగురుమామిడి.
*పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్. కేసు వివరాలు తెలియపరుస్తూ* ఫిర్యాది గట్టు కృష్ణస్వామి తండ్రి వెంకటయ్య, వయస్సు 55 సంవత్సరములు, కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నకరే కొమ్ముల మధిర గ్రామం పరివేద, తన కూతురు గీత వయసు 21 సంవత్సరాలు తేదీ: 17-12-2012 నాడు ఉదయం నాలుగు గంటలకు ఇంటి నుండి బయలుదేరి తిరిగి ఇంటికి రానందున చుట్టుపక్కల మరియు బంధువుల దగ్గర వెతికిన ఎలాంటి జాడ కనబడలేదు తేదీ: 18-12-2012 నాడు పరివేద గ్రామ శివారులోని వెల్దండ సాయిలు పత్తి చేనులో చనిపోయి ఉన్నదని తెలియగా ఫిర్యాది వెళ్లి చూడగా గీత వేసుకున్న పాయింట్ తొ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసి చంపినాడని ఫిర్యాది దరఖాస్తు ఇవ్వగా అప్పటి హుస్నాబాద్ సీఐ తిరుమలేష్ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించి అన్ని కోణాలల్లో విచారణ చేసి పై నిందితున్ని పట్టుకొని విచారించగా అత్యాచారం చేసి హత్య చేసినానని నేరం ఒప్పుకున్నాడు, పై నిందితున్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది. హుస్నాబాద్ సీఐ సదన్ కుమార్,తదుపరి పరిశోధన లో టెక్నికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కేసు పరిశోధన పూర్తిచేసి నేరస్తునిపై కోర్టులో చార్జిషీట్ వేయడం జరిగింది.
ఆరోజు నుండి ఈరోజు వరకు సిద్దిపేట అడిషనల్ డిస్టిక్ & సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరిగింది.
ఈరోజు అడిషనల్ డిస్టిక్ సెషన్స్ జడ్జి శ్రీ వై. జయప్రసాద్ గారు, ఇరువురి వాదనలు విన్న తర్వాత నేరస్తుని పై నేరం రుజువైన నందున పై నేరస్తునికి 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, మరియు 1,50,000/- రూపాయల జరిమానా విధించడం జరిగింది.
హుస్నాబాద్ ఏసీపి సదానందం, హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, కోహెడ ఎస్ఐ అభిలాష్, కోర్టు మానిటర్ ఎస్ఐ గంగరాజు, కోర్టులో సాక్ష్యం ఎలా చెప్పాలో సాక్షులను మోటివేట్ చేయడం జరిగింది.
*ఫై నేరస్థునికి జైలు శిక్ష పడడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యస్. ఆత్మ రాములు, తన వాదనలు వినిపించారు, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ అభిలాష్, కోర్టు మానిటర్ ఎస్ఐ గంగరాజు, కోర్టు కానిస్టేబుల్, శివ ప్రసాద్, కోర్టు లైజనింగ్ హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్ రెడ్డి, లోకేష్, కీలక పాత్ర వహించారు*.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., గారు కేసు ఇన్వెస్టిగేషన్ పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు విధులు నిర్వహించే అధికారులను సిబ్బందిని అభినందించారు. త్వరలో నగదు పురస్కారం అందజేస్తామని తెలిపారు.









