ఆశా ఫెసిలిటేటర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి

జనం పవర్,కరీంనగర్,సెప్టెంబర్ 10

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశాఫెసిలిటేటర్స్ తో  సమీక్షా సమావేశo నిర్వహిoచారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల  వారీగా సమీక్షిస్తూ  అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మొదటి  కాన్పుల కొరకు గర్భవతులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సాధారణ డెలివరీ కొరకు ప్రోత్సహించాలన్నారు.గైనకాలజీ డాక్టర్ చేత హెల్త్ చెకప్ చేయిస్తూ  సిజేరియన్ డెలివరీల వల్ల  ఉత్పన్నమయ్యే అనారోగ్య సమస్యలను గర్భిణీ స్త్రీ కి మరియు ఆమె కుటుంబ సభ్యులకు తెలియచేయాలన్నారు.గర్భవతి సమయంలో వారికి ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉంటే వాటికి పూర్తిగా చికిత్స అందించి నార్మల్ డెలివరీ కొరకు వారిని ప్రోత్సహించాలన్నారు. ఆరోగ్య మహిళ క్యాంపులలో మహిళ స్క్రీనింగ్ 100% పూర్తి చేసి తిరిగి వారికి రిస్క్రినింగ్ పూర్తి చేయాలన్నారు. ఆరోగ్య కేంద్రాల డెలివరీల కొరకు ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంపులను  పూర్తి సద్వినియోగం చేసుకోవాలన్నారు.30 సం”ల వయస్సు పై బడిన వారందరికీ అధిక రక్తపోటు, షుగర్ పరీక్షలు చేసి నిర్ధారణ అయిన వారందరికీ ప్రైవేటు మందులు కాకుండా ఉచితంగా ప్రభుత్వ సరఫరా చేసే మందులు అందజేసి వాడుకునేలా చూడాలన్నారు. తీవ్ర పోషక ఆహార లోపం కలిగి ఉన్న పిల్లలను, బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి పోషకాహార పునరావాస జిల్లా కేంద్రానికి  పంపించడానికి ఆర్బిఎస్కే మరియు 102 వాహనాలను  ఉపయోగించుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇన్ పేషెంట్ గా రోగులకు చికిత్స అందించినప్పుడే  పి.హెచ్.సి డెలివరీలు  ఎక్కువగా అవుతాయన్నారు. అందుకు అందరూ సూపర్వైజర్ సిబ్బంది శ్రద్ధ తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశా ఫెసిలిటేటర్స్ పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :