జనం పవర్, కరీంనగర్ ,సెప్టెంబర్ 10
ఈనెల 8న మేడ్చల్ బార్ అసోసియేషన్ సభ్యుడు సురేష్ బాబు, ఖమ్మం బార్ అసోసియేషన్ సభ్యుడు ఎండి జహీర్ అలీ, ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు ఇజ్జగిరి మనోజ్ ల పైన జరిగిన దాడులను నిరసిస్తూ కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, కందుల అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. బుధవారం కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదుల పై జరుగుతున్న దాడులపై నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ న్యాయవాదులకే రక్షణ లేకుండా పోతున్నదని, వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలను డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కోర్టు నుండి డా బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్దకు, జిల్లా కలెక్టర్ కార్యాలయంకు వెళ్లి డి.ఆర్.ఓ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు కుసుంబ కృష్ణ రావు, కొరివి వేణు గోపాల్, పెంచాల మురహరి రావు, బి రామ్ రెడ్డి, పి బాపు రావు, వినయ్, కె శ్రీనివాస్,జె గణేశ్ , కె పరశురాం, బి వేణు తదితరులు పాల్గొన్నారు.









