ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్‌జెండర్లు*   *గణేశ్ నిమజ్జనోత్సవం బందోబస్తులో సేవలు* *హైదరాబాద్ తరహా జగిత్యాల జిల్లాలో ట్రాన్స్ జెండర్లకు బాధ్యత అప్పగించిన ఎస్పీ అశోక్ కుమార్*

*ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్‌జెండర్లు*

*గణేశ్ నిమజ్జనోత్సవం బందోబస్తులో సేవలు*

*హైదరాబాద్ తరహా జగిత్యాల జిల్లాలో ట్రాన్స్ జెండర్లకు బాధ్యత అప్పగించిన ఎస్పీ అశోక్ కుమార్*

*జనం పవర్.జగిత్యాల ప్రతినిధి.సెప్టెంబర్ 05*

జగిత్యాల జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జనోత్సవం బందోబస్తులో ట్రాన్స్‌జెండర్లచే ట్రాఫిక్ నియంత్రణ చేపట్టడం జరిగింది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమైన ప్రజా సేవా కార్యక్రమ బాధ్యతల్లో ట్రాన్స్‌జెండర్‌లను చేర్చి జగిత్యాల రెండవ జిల్లాగా నిలిచిందని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
గణేశ్ నిమజ్జన బందోబస్తులో ట్రాన్స్‌జెండర్లను భాగస్వామ్యం చేయడం వల్ల సమాజంలో ప్రతి వర్గానికీ గౌరవం, మర్యాద, సమానత్వం అందించే మంచి  సందేశం వెళ్తుంది అని ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. తమదైన జీవనశైలిలో ఉండే వీరికి సమాజంలో వివక్షను పోగొట్టడానికి  ట్రాఫిక్ వీధుల్లోకి తీసుకోవడం జరిగిందని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో 11 మంది ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ విదులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఇలాంటి బాధ్యతల్లో ట్రాన్స్‌జెండర్‌లను చేర్చిన రెండవ జిల్లా జగిత్యాలగా నిలిచిందని ఎస్పీ అశోక్ కుమార్  తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :