జనం పవర్, కరీంనగర్ ,సెప్టెంబర్ 05:
జగిత్యాల నుండి కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారిలో గణేష్ శోభాయాత్ర మరియు నిమజ్జనం కారణంగా వాహనాల రాకపోకలకు తాత్కాలిక అంతరాయం కలిగింది. భారీగా భక్తులు ఊరేగింపులో పాల్గొనడంతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో వాహనాలను వెలిచాల మీదుగా దారి మళ్లిస్తూ, ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు ట్రాఫిక్‌ను సమర్థంగా నియంత్రిస్తున్నారు. నిమజ్జనం కార్యక్రమం సజావుగా సాగేందుకు అదనపు బలగాలను మోహరించి, రహదారి రెండు వైపులా పోలీసులు క్రమశిక్షణ పాటించేలా ఏర్పాట్లు చేశారు. ప్రజలు సహకరించి శాంతి భద్రతలను కాపాడాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Post Views: 65









