కొండన్నపల్లి గణపతి లడ్డు వేలం – రూ.90 వేలకు అంజయ్య దంపతుల కైవసం

**గంగాధర, సెప్టెంబర్ 5 (జనం పవర్):**

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని కొండన్నపల్లి హనుమాన్ దేవాలయంలో గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున సంప్రదాయ లడ్డు వేలం ఘనంగా నిర్వహించారు.

వినాయక లడ్డూ వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొనగా, తొర్రికొండ అంజయ్య–దంపతులు రూ.90 వేల రూపాయలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల కోలాహలంతో మార్మోగింది.

వేలం అనంతరం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, గణపతి కటాక్షం గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :