ఐరన్ బ్రిడ్జిలను నిర్మిస్తాం
జనం పవర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో సెప్టెంబర్ 5:
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను, వంతెనలను పరిశీలిస్తూ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పలు గ్రామాలలో పర్యటించారు.
ఉమాపతికుంట వెళ్ళు దారిని పరిశీలించారు.
కన్నాపూర్ తాజా మాజీ సర్పంచ్ జుగాది రావు స్వగృహం ఉమాపతి కుంటలో పరామర్శించారు. తదనంతరం పలు గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న పంటలకి నష్టపరిహారం అందుతుందని హామీ ఇచ్చారు. గ్రామస్తులతో మాట్లాడుతూ… సమస్యలకు పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఉట్నూరు మండలం దంతనపల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనారోగ్యంతో ఇటీవల మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి కుటుంబాన్ని పరామర్శించరూ.
నర్సాపూర్ జి గ్రామానికి వెళ్లే దారిని పరిశీలించి అలాగే నర్సాపూర్ జె వాగుపై ఐరన్ బ్రిడ్జి నిర్మించే విధంగా నిన్న తీర్యాని పర్యటనలో భాగంగా ఐరన్ బ్రిడ్జిలను నరసాపూర్ జి వాగుపై నిర్మించి ఆయా గ్రామాల ఇబ్బందులను దూరం చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ఎస్టిమేషన్ ని చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.










