**జనం పవర్, గంగాధర సెప్టెంబర్ 5:**
బూరుగుపల్లి గ్రామంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో సాంప్రదాయక లడ్డు వేలం ఘనంగా నిర్వహించారు.
పవిత్ర లడ్డు వేలంలో గ్రామ భక్తులు పోటీపడి పాల్గొనగా, చివరగా సాగి అజయ్ రావు బూరుగుపల్లి గారు రూ.4016/-కు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులతో గ్రామంలో శాంతి, శ్రేయస్సు నెలకొనాలని ఆకాంక్షించారు. భక్తులందరూ మహోత్సవాల్లో పాల్గొని శ్రీ వినాయకుని కటాక్షాలను పొందాలని పిలుపునిచ్చారు.
Post Views: 90









