* పిల్లలు బడిలోనే ఉండాలి
* పిల్లల భవిష్యత్ పాడు చేస్తే కేసులు పెడతాం
జనం పవర్, కరీంనగర్, సెప్టెంబర్05:
కరీంనగర్ లో తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.బాల భిక్షాటన కారుల విముక్తి కోసం సంఘ సభ్యులు పలు ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న,చేయిస్తున్న వారికి డిస్ట్రిక్ట్ చిల్డ్రన్స్ ప్రొటెస్ట్ అధికారులతో కలిసి పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చామని స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి షబ్బీర్, జిల్లా అధ్యక్షులు ఎండి దావూద్ తెలిపారు. వారు మాట్లాడుతూ…. రాష్ట్ర అధ్యక్షులు షేర్ ఆలీ ఆదేశాల మేరకు గత నెల రోజులుగా బాల భిక్షాటన కారులు బాల కార్మికుల విముక్తి కోసం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా నేడు కరీంనగర్ లో వివిధ ప్రాంతాల్లో సంఘ సభ్యులు భిక్షాటన చేస్తున్న పది మంది పిల్లలను గుర్తించామని,వారికి అధికారులతో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.పద్దతి మార్చుకోకుంటే కేసులు నమోదు చెయ్యడం జరుగుతుంది అని హెచ్చరించారు.కరీంనగర్ లో దాదాపు వంద పిల్లలు భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించి ఈ కార్యక్రమం చేపట్టాం.దాదాపు 70% తగ్గడం జరిగింది.కరీంనగర్ లో ఒక్కరు కూడా బిక్షాటన చేసేవారు లేకుండా చేయడానికి కృషి చెయ్యాల్సి ఉంది.పిల్లల చదువుల కోసం అవసరం అయిన అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాడానికి మేమున్నాం అని పిల్లల తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం.సంచార ముస్లింలలో అక్షరాస్యత శాతం పెరగాలంటే,వెనకబాటు తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి దానం కాదు పసి పిల్లలకు మొదట విద్య అందించాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి షబ్బీర్,రాష్ట్ర కోశాధికారి ఎండి షాదుల్లా,జిల్లా అధ్యక్షులు ఎండి దావూద్,సెక్రటరీ అజ్మత్,జాయింట్ సెక్రటరీ ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.









