**జనం పవర్, గంగాధర సెప్టెంబర్ 5:**
గంగాధర మండలం మధురానగర్లో అభిగ్న యూత్ ఆధ్వర్యంలో గణపతి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం భక్తి భావంతో నిర్వహించారు. వందలాది మంది భక్తులు మహాగణపతి ఆశీస్సులు పొందుతూ అన్నదానంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి అన్నదాతలుగా ఇప్పలపల్లి మల్లేశం – మంజుల దంపతులు ముందుకు వచ్చి సేవ అందించారు.
ప్రత్యేక అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, స్థానిక ప్రజలతో కలసి భోజనం చేసి, అభిగ్న యూత్ అసోసియేషన్ సభ్యుల సేవా తపనను అభినందించారు. యువత సమాజ సేవలో చూపిస్తున్న చొరవ ఆదర్శప్రదమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Post Views: 67









