*గణపయ్యకు 51 నైవేద్యాలు* 

జనం పవర్,
కోహెడ మండలం,
సెప్టెంబర్ 05:

కోహెడ మండల బస్వాపూర్ గ్రామంలో 51 సంవత్సరాల. నుండి గణపతి నవరాత్రి ఉత్సవాలు రావిచెట్టు వద్ద నిర్వహిస్తున్నారు. నవరాత్రులు చివరి రోజు అయిన  సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, ఈరోజు ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు మహిళలు 51 నైవేద్యాలను గణేశుని కి సమర్పించుకున్నారు. మహిళలు పార్వతి తనయునికి ప్రత్యేకమైన భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం.జరిగింది ప్రతి ఏటా స్వామివారిని ఇలాగనే నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటామని. మహిళలు తెలియపరచడం జరిగింది. రావిచెట్టు గణపతి వద్ద లడ్డు ప్రత్యేకత అన్ని భక్తులు నమ్మకంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం లడ్డు వేలంలో అధిక సంఖ్యలో భక్తులు. పాల్గొని లడ్డును వేలంలో పొందిన వారి కుటుంబంలో శుభాలు కలుగుతాయని. భక్తుల ప్రగాఢగా నమ్మకంగా భావిస్తారు. ప్రతి ఏటా రావి చెట్టు గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు ఎంతో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం  జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, గ్రామ ప్రజలు, పాల్గొనడం జరిగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :