అవినీతిపరుల అంతమే అఖిలపక్ష ఐక్యవేదిక ఎజెండా

జనం పవర్, వనపర్తి, సెస్టెంబర్ 5 : అందరితో కలిసి అడుగులు వేస్తాం, వనపర్తిని ఆదరిస్తాం అర్హులను అందలం ఎక్కిస్తాం అవినీతిపరుల అంతం చూస్తాం ఇదే అఖిలపక్ష ఐక్యవేదిక  ఎజెండా అని సతీష్ యాదవ్ తెలిపారు.శుక్రవారం వనపర్తిలో డాక్టరేట్ & గిడుగు రామమూర్తి అవార్డుల గ్రహీత సతీష్ యాదవ్ స్వగృహంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, ధర్మ సమాజ్ పార్టీ డిఎస్పి జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో నాయకులు తరలివచ్చి పెద్ద ఎత్తున సన్మానం చేశారు. ఈ సందర్భంగా  కార్మిక నాయకుడు వివి మూర్తి, డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అలుపెరుగాక, అదరక,బెదరక కలిసి వచ్చే నాయకులతో ప్రజా సేవ చేస్తూ, అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, అవసరం ఉన్న ప్రతి చోట పోరాడుతూ, అఖిలపక్ష ఐక్యవేదికను ఒక బ్రాండ్ గా సృష్టించారని ప్రజా హృదయాలకు చేరువయ్యారని తెలిపారు. సతీష్ యాదవ్ మాట్లాడుతూ
ఇవి నాకు చేసే సన్మానాలు అనుకోవడం లేదు, అఖిలపక్ష ఐక్యవేదికను గుర్తించి మాకు దీవెనలు ఇస్తున్నారని భావిస్తున్నామని, రానున్న కాలంలో అందరినీ కలుపుకొని ప్రజలకు సేవ చేసే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుందనీ మేధావులు ప్రముఖులు చెప్పే విధంగా మాత్రమే కార్యక్రమాలు ఉంటాయని , నన్ను సన్మానించిన ప్రతి ఒక్కరి ఆశయాలు నెరవేరుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఆర్టీసీ బీసీ సంఘం నాయకులు   వి.వి మూర్తి, గోకం భాస్కర్, దేవేందర్ ఏ ఎం ఎఫ్ శ్రీనివాసులు ఎం. సి. వెంకటేష్ గౌడ్, రమేష్, కిరణ్ కుమార్ ధర్మ సమాజ్ పార్టీ నుండి అధ్యక్షులు రామకృష్ణ, కడుకుంట్ల కురుమయ్య, అశోక్, ఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :