ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ ముందస్తు వేడుకలు

జనం పవర్ సెప్టెంబర్ 04:

### ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ ముందస్తు వేడుకలు

మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ ముందస్తు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించబడ్డాయి.

కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ పరిషయ్య మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి పదవికి చేరి దేశానికి సేవలందించడం విశేషమని తెలిపారు. ఆయన జీవితం ప్రతి ఉపాధ్యాయుడికి, విద్యార్థికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యువత ఆయన ఆదర్శాలను అనుసరించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కృష్ణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డా. లక్ష్మీనారాయణ, అధ్యాపకులు అమర్నాథ్, ముకుందం, శేఖర్, దుర్గం కృష్ణ, శ్రీధర్, ఫర్జానా, మానస, రజిత, బోధనేతర సిబ్బంది శ్రీనివాస్, దుర్గరాజు పాల్గొన్నారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :