ఏడేళ్ల తర్వాత చైనాకు మోడీ

• షీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు
• ప్రపంచ దృష్టి ని ఆకర్షిస్తున్న సమావేశాలు
• జపాన్ పర్యటనలో ప్రత్యేక కానుకలు

జనం పవర్, హైదరాబాద్:
భారత ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత చైనా గడ్డపై అడుగుపెట్టారు. శనివారం చైనాలోకి చేరిన ఆయన, ఆదివారం నుంచి సోమవారం వరకు తియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. అమెరికా విధించిన వాణిజ్య సుంకాల ఒత్తిడి నేపథ్యంలో భారత్–చైనా దేశాలు మరింత దగ్గర కావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతల అనంతరం, రెండు దేశాల మధ్య బలహీనమైన సంబంధాలను పునరుద్ధరించడం ఈ చర్చల ప్రధాన అజెండాగా భావిస్తున్నారు. సరిహద్దుల్లో శాంతి కొనసాగించడం, వాణిజ్య మార్గాలను విస్తరించడం, నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించడం వంటి అంశాలపై ఇరు దేశాధినేతలు సానుకూలంగా స్పందించనున్నట్టు సమాచారం.

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇటీవల న్యూఢిల్లీలో పర్యటించగా, ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ–షీ భేటీకి విశేష ప్రాధాన్యం లభించింది.

మోదీ చివరిసారి 2018లో చైనాను సందర్శించారు. ఈసారి ఎస్‌సీవో సదస్సులో ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు పలు దేశాధినేతలతో కూడా సమావేశమవుతారు.

మోదీ–షీ భేటీ ద్వారా భారత్–చైనా ఆర్థిక సంబంధాలు కొత్త దశలోకి వెళ్లే అవకాశముంది.


 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :