*జనం పవర్, గంగాధర – ఆగస్టు 31:*
గంగాధర మండలం *కొండన్నపల్లి స్టేజి* సమీపంలో కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్ళే *నేషనల్ హైవేపై భారీ చెట్టు కూలి రోడ్డును పూర్తిగా అడ్డుపడింది*. దీంతో వాహనాల రాకపోకలు కొంతసేపు పూర్తిగా నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న వెంటనే *SI వంశీ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని*, గ్రామస్థులతో కలిసి రోడ్డుపై పడిన చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు. కొద్ది సేపటిలోనే రహదారి శుభ్రపరిచి ట్రాఫిక్‌ను తిరిగి పునరుద్ధరించారు.
ఈ ఘటన కారణంగా వాహనదారులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నా, పోలీసులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడంతో ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.

Post Views: 30









