*గణపతి పూజలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి*

 

జనం పవర్, మాడుగులపల్లి ఆగస్టు 31;

మాడుగులపల్లి మండలంలోని చెరువుపల్లి గ్రామంలో ముత్యాలమ్మ గుడి దగ్గర చెరువుపల్లి లోకల్ బాయ్స్ యూత్ వారి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణపతి దగ్గర ఆదివారం బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి పూజలో పాల్గొని కొబ్బరికాయ కొట్టారు. అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి మండపంలో ఆదివారం కట్టాలింగారెడ్డి అమృతమ్మ దంపతులు మహా అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కాలనీవాసులు అధికంగా సంఖ్యలో విచ్చేసి అన్నదానంను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షులు ఇటికాల జాన్ రెడ్డి, సాయి రెడ్డి మహేష్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :