వినాయకుని సేవలో వెలిచాల.. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు. విస్తృతంగా వినాయక మండపాలను సందర్శించిన వెలిచాల రాజేందర్ రావు

 

జనం పవర్, కరీంనగర్ ఆగస్టు 31:

కరీంనగర్లో విస్తృతంగా గణపతి మండపాలను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు సందర్శించారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు అలుపెరగకుండా వినాయకుని ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్లో పలు చోట్ల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు, స్థానిక ప్రజలు, కాలనీవాసులు పెద్ద ఎత్తున ఆయాచోట్ల రాజేందర్రావుకు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం సీతారాంపూర్లో పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్దకు వెళ్లి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొత్తపల్లిలో బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని రాజేందర్రావు ప్రారంభించారు. భక్తులకు మహిళలకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. వావిలాలపల్లి, కిసాన్ నగర్, సరస్వతి నగర్, బుట్టి రాజారాం కాలనీ చింతకుంట తో పాటు తదితర కాలనీల్లో వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ విజ్ఞేశ్వరుడి ఆశీస్సులతో కరీంనగర్ ప్రజలు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. విగ్నేశ్వరుడి చల్లని చూపు కరీంనగర్ పై ఉంటుందని అన్ని రంగాల్లో కరీంనగర్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా స్వామివారు కరుణ చూపాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు రాజేందర్ రావ్ పేర్కొన్నారు. వినాయక మండప నిర్వాహకులు, స్థానికులు, మాజీ ప్రజా ప్రతినిధులు వెలిచాల రాజేందర్రావును శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు కాలనీలవాసులు, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :