సిరిసిల్ల వరద బాధితులకు బండి సంజయ్ రూ.10 లక్షల సాయం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటన.

జనం పవర్, కరీంనగర్ ఆగస్టు 31:

సిరిసిల్ల జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలతో నష్టపోయిన బావితులకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు వరద బాధితులకు 10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. కరీంనగర్ కలెక్టర్కు త్వరలోనే పంపిస్తానని తెలిపారు. తనఎంపీ లాడ్స్ నిధుల నుండి ఈ మొత్తాన్ని సంబంధిత సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు త్వరలోనే అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లాలో భారీ ఎత్తున నష్టం సంభవించిందన్నారు. రైతులకు పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించిందని, పలువురు నిరాశ్రయులయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీ లాడ్స్ నిధుల మొత్తాన్ని సిరిసిల్ల జిల్లా బాధితులను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్ ద్వారా ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :