జనం పవర్,జమ్మికుంట, ఆగస్ట్ 31:
స్థానిక వర్తక సంఘం హాల్లో జమ్మికుంట,ఇల్లందకుంట,వీణవంక మండలాలకు చెందిన న్యాయవాదులందరు ఆదివారం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జమ్మికుంటలో మున్సబ్ మెజిస్ట్రేట్ కం జూనియర్ సివిల్ జడ్జి కోర్టును నెలకొల్పాలని 30 మంది న్యాయవాదులు ఏకాభిప్రాయంతో తీర్మానం చేసారు. జమ్మికుంట,వీణవంక,ఇల్లందకుంట మండలాలతో కలుపుకొని సివిల్,క్రిమినల్ కేసులు దాదాపుగా 4000 విచారణలో ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట సీనియర్ న్యాయవాది శేషాల సారంగపాణి అకాల మరణం గుర్తుచేసుకొని వారి ఆత్మ శాంతించాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వంగల పవన్ కుమార్,ఏ బూసి లింగారెడ్డి, పొట్లపల్లి శ్రీధర్ బాబు,నక్క సత్యనారాయణ,కడార్ల సాంబమూర్తి,మొలుగూరి సదయ్య,నూతల శ్రీనివాస్,కనకం తిరుపతి,రావికంటి మధుబాబు, మొలుగూరి పద్మావతి,మ్యాదరి పద్మలత,జోష్ణ దేవి,సుకన్య, శ్రీరామ్ శిరీష,అబ్బరవేణి రాజు, వంశీకృష్ణ గూడెపు,యంగల లింగమూర్తి,అప్పని రాజు,పిట్టల రాజేష్,ముంజాల విజయ్,మోరే కళ్యాణ్,గుండ వరప్రసాద్,నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.









