జనం పవర్, కరీంనగర్ ఆగస్టు 31
బంజారా, లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసివేయాలని ఆదివాసీ నాయకులు సోయం బాపూరావు, తెల్లం వెంకటరావు సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయం పై రాష్ట్రస్థాయిలో గిరిజన సంఘాల నాయకులు,మేధావులు, న్యాయ నిపుణులతో ఆదివారం హైదరాబాదులో జరుగుతున్న చర్చ గోష్ఠి లో పాల్గొనడానికి కరీంనగర్ నుండి బయలుదేరిన గిరిజన సంఘాల నాయకులను కరీంనగర్లో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమా సాహెబ్, జిల్లా అధ్యక్షుడు బోడా మోహన్ నాయక్, రాష్ట్ర నాయకులు శివరాజులను పోలీసులు హౌస్ అరెస్ట్ (గృహనిర్బంధం) చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బీమా సాహెబ్ అరెస్టును ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారాలను ఎస్టీ జాబితా నుండి తీసివేయాలనడం చట్ట విరుద్ధమని అన్నారు. రెండు తెగల మధ్య వైశ్యామ్యాలు పెంచి శాంతి భద్రతలకు విగాథం కలిగించే విధంగా ప్రయత్నిస్తున్న ఆదివాసీ నాయకులు బాబురావు, తెల్ల వెంకటరావు లను అరెస్టు చేయాలని అన్నారు. బంజారా లంబాడీలను యాక్ట్ 108/1976 పార్లమెంట్లో చట్టం ద్వారా ఎస్టీ జాబితాలో చేర్చారని ఇది చట్టబద్ధంగా జరిగిన ప్రక్రియ అని, దీనిపై రెచ్చగొట్టే చర్యలకు దిగడం సరైనది కాదన్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని కోరారు దీనిపై రాష్ట్ర స్థాయిలో గిరిజన సంఘాల తరఫున ప్రభుత్వానికి త్వరలో కొన్ని సూచనలు కూడా చేస్తామని తెలిపారు. అక్రమ అరెస్టులను గిరిజనులు,ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు.









