గోదావరిఖని (జనం పవర్ న్యూస్)తేదీ: 31-08-2025
*కనీస వేతనం 26,000/- గా నిర్ణయించి అమలు చేయాలి సీలింగ్ విధానాన్ని ఎత్తివేయాలి
ఎం శ్రీనివాస్. ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని ఐ ఎఫ్ టీ యు. కార్యాలయం లో జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది
ఈ యొక్క సదస్సుకు ముఖ్య వక్తగా హాజరైన *ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ లు మాట్లాడుతూ… మన రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో ప్రధానంగా సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ ఎఫ్ సి ఎల్, బసంత నగర్ గ్రామపంచాయతీ మున్సిపల్, ప్రభుత్వ హాస్పిటల్ ఇతర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులతో పాటు స్కీమ్ వర్కర్స్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వేతనాలు ఉద్యోగ రెగ్యులరైజేషన్ ఉపాధి ఉద్యోగ భద్రత పని గంటల భారం, పని స్థలాల్లో రక్షణ. తదితర సమస్యలతో పాటు వీ డి ఏ. వర్తించే కార్మికులకు ఐదేళ్ల కు ఒకసారి అది వర్తించనీ వారికి రెండేళ్లకోసారి వేతనాలు సవరించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని.ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు
వేలాది పరిశ్రమలు అత్యంత ప్రమాదకర స్థితిలో నిర్వహించబడుతున్నాయని ఫ్యాక్టరీలలో నిరంతరం ప్రమాదాలు జరుగుతున్నాయని ఇప్పటికీ 40 వేల మంది కార్మికులు అత్యంత ప్రమాదకర స్థితిలోనూ మరో 5.వేల మంది తీవ్ర ప్రమాదక ర స్థితిలో విధులు నిర్వహిస్తున్నారనీ అన్నారు.ఈ స్థితిలో వృత్తి పరమైన భద్రత ఆరోగ్యం వర్కింగ్ కండిషన్ కోడ్ ద్వారా ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల ఇన్స్పెక్షన్ అధికారులను కుదించి లేబర్ ఫెసిలేటర్స్ గా మార్చింది.ఈ చర్య కార్మిక వర్గం రక్షణ, హక్కులకు నష్టకరమైందని అన్నారు
లేబర్ కోడులను ఆధారం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పై పని భారం మోపడానికి 8. గంటల పని దినాన్ని 10. గంటలకు మార్చడానికి ప్రయత్నం చేస్తుందన్నారు
ఇది అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొన్న వారానికి 48. గంటల పని దినానికి విరుద్ధం నిజానికి పని వారమంటే ప్రస్తుతం ఉన్న “కనీస వేతనాల” (సెంట్రల్) రూల్స్ ప్రకారం వారానికి 48. గంటలు మాత్రమే పని చేయాలని అందువలన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్. 7న సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాదులో రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహిస్తుందని ఈ సదస్సులో వేలాదిగా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
ఈ యొక్క సదస్సుకు ఐ ఎఫ్ టీ యు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ అధ్యక్షత వహించగా ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ జిల్లా నాయకులు చిలుక శంకర్ ఈదునూరి రామకృష్ణ ఐ రాజేశం పి స్వామి కొండ్ర మొగిలి ఎం దుర్గయ్య టీ రాయమల్లు ఎడ్ల రవికుమార్ ఎం కొమరయ్య,బి కొమరయ్య రమేష్ పెరుక వెంకటస్వామి ఓదెలు పద్మ రాజేశ్వరి రాయమల్లమ్మ బానమ్మ తదితరులు పాల్గొన్నారు.









