గోదావరిఖని (జనం పవర్ న్యూస్)తేదీ:31-08-2025
హెచ్ఎంఎస్ 26 వ మహాసభలకు బయలుదేరిన గోదావరిఖని ఆర్జీ 1 2 3 నాయకులు కార్మికులు
ఈరోజు స్థానిక తిలక్ నగర్ హెచ్ఎంఎస్ కార్యాలయం నుండి రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, నస్పూర్ కాలనీ లో జరిగే హెచ్.ఎం. ఎస్. 26 వ మహాసభలను జయప్రదం చేయడానికి గోదావరిఖని తిలక్ నగర్ హెచ్ఎంఎస్ కార్యాలయం నుండి రమేష్ నగర్ ఎల్బీనగర్ సీతానగర్ చౌరస్తా జిఎం ఆఫీస్ మీదుగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ 26వ మహాసభకు భారీ బైక్ ర్యాలీతొ
ఆర్జీ వన్ టూ త్రీ, ఏరియాల నుండి హెచ్ ఎం ఎస్ కార్యకర్తలను తరలించడానికి బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ సభ విజయవంతం కోసం సుమారు వేయి మంది దాదాపు 12 ఏరియాల రీజియన్ నుండి రైళ్లలో బైకులతో మహాసభ జరిగే మంచిర్యాల జిల్లా లోని శ్రీరాంపూర్ నస్పూర్ కాలనీ కి చేరుకుంటున్నారన్నారు రానున్న రోజుల్లో హెచ్.ఎం. ఎస్. అన్ని రంగాల కార్మికులకు దిక్సూచిగా మారనుందని కార్మికుల హక్కుల కోసం పోరాడుతుందని. రాబోయే సింగరేణి ఎన్నికల్లో యజమాన్య తొత్తు సంఘాలను కూల్చడం ఖాయమని రాష్ట్రంలో మరియు సింగరేణిలో హెచ్ఎంఎస్ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని దానికి మహాసభలే నిదర్శమని అన్నారు ఈ మహాసభకు అనేక మంది కార్మికుల నాయకులు తరలివెళ్లారు









