*జనం పవర్,బైంసా,ఆగస్టు 31:*
గోదావరి నది పరిసరా ప్రాంతాల్లో ఎవరు వెళ్లకూడదని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఖానాపూర్ సిఐ అజయ్ , ఎస్సై రాహుల్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.. కానీ ఏ మాత్రం పట్టించుకోకుండా ఓ రైతు కూలి ఉగ్రరూపంలో ఉన్న గోదావరిలో పడి కొట్టుకపోయిన ఘటన ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి గ్రామంలో చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజీపేట్ గ్రామానికి చెందిన మాదాస్తు మల్లయ్య గత 20 సంవత్సరాల క్రితం ఖానాపూర్ మండలంలోని బదనకుర్తి గ్రామానికి కూలి పని కోసం వలస వచ్చి ఆ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. మల్లయ్య ఆదివారం గ్రామం పక్కన ఉన్న గోదావరి మేకల రేవు, స్మశాన వాటిక ప్రాంతంలో చూడటానికి వెళ్లిన ఆయన ప్రమాదవశత్తు గోదావరి నదిలో పడి గోదారి ప్రవాహనికి కొట్టుకపోయాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొందరు ఆయనను ఒడ్డుకురా నీ కేకలు వేయగా, గోదావరి ప్రవాహానికి కొట్టుకపోతున్న ఆయన ఈదుకుంటూ మలుపు ప్రాంతంలో ఒడ్డు ప్రాంతానికి చేరుకున్నాడు. ఎట్టకేలకు ఒడ్డుకు చేరుకొని కళ్ళారా మృత్యువుని జయించాడు.









