జనం పవర్, ఉమ్మడి కరీంనగర్ బ్యూరో ఆగస్టు31
బిజెపి రాష్ట్ర అధ్యక్షుని హోదాలో మొదటిసారిగా ఈనెల 3వ తేదీన కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి పోలింగ్ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో పాల్గొననున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మొదటిసారిగా కరీంనగర్ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న ఘన స్వాగతం పలకాలని , అనంతరం పట్టణంలోని కొండ సత్యలక్ష్మి గార్డెన్స్ లో జరిగే పోలింగ్ బూత్ అధ్యక్షులసమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రోజున కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో బిజెపి ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గంగా డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా తలపెట్టిన ప్రోగ్రాంలన్నీ సక్సెస్ చేయడానికి బిజెపి శ్రేణులు తగిన కృషి చేయాలన్నారు. ఆయా ప్రోగ్రాం ల నిర్వహణ కోసం నియమింపబడ్డ ఇన్చార్జులు తమ తమ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. బిజెపి పోలింగ్ బూత్ శ్రేణులు బూత్ సమ్మేళన సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని తెలిపారు. ముఖ్యంగా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి , బిజెపి శక్తి చాటి చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రధానంగా ఆరు గ్యారెంటీలు, 420 హామీల ప్రభుత్వ మోసాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిల్లపు రమేష్, కోమల ఆంజనేయులు, ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, పార్లమెంటు కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు , సీనియర్ నాయకులు కన్నబోయిన ఓదెలు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్ , జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకట్ రెడ్డి, గుర్రాల వెంకటరెడ్డి, రంగు భాస్కరాచారి, ఎండి ముజీబ్, దురిశెట్టి సంపత్ , దూబాల శ్రీనివాస్, దండు కొమురయ్య, పుప్పాల రఘు, గుజ్జ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ కొలగని శ్రీనివాస్ లతో పాటు మండల, జోన్ అధ్యక్షులు, ప్రోగ్రాం ఇన్చార్జులు , మోర్చా బాధ్యులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ మన్ కి బాత్ వీక్షించిన బిజెపి నేతలు
జనం పవర్, ఉమ్మడి కరీంనగర్ బ్యూరో ఆగస్టు 31
కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పార్టీ నేతలతో కలిసి ఆదివారం రోజున ప్రసారమైన ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మన్ కీ బాత్ లో ఆపరేషన్ పోలో విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారని తెలిపారు.నిజాం అరాచక పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అతి తక్కువ కాలంలోనే ఆపరేషన్ పోలోను నిర్వహించి, భారతదేశంలో విలీనం చేశారని, 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినా.. హైదరాబాద్ మాత్రం ఇంకా నిజం చెరలోనే ఉండిపోయిన సందర్భాన్ని ప్రధాని గుర్తు చేశారన్నారు. అమాయక ప్రజలపై రజాకార్లు అత్యాచారాలు హత్యలకు తెగబడ్డారని,వీటిని చూసి సహించలేకపోయిన అప్పటి ఉప ప్రధాని సర్దార్ పటేల్.. ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ పై ప్రత్యేక సైనిక చర్యను చేపట్టి భాగ్యనగరాన్ని భారతదేశంలో కలిపేశారనే విషయాన్ని ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో వివరించారని తెలిపారు. అందుకేసెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి , ఆపరేషన్ పోలోలో భాగమైన వీరులను స్మరించుకోవాలని ప్రధాని మోడీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారని ఆయన తెలిపారు.









