జనం పవర్ న్యూస్ మందమర్రి :
ఆదివారం, ఆగస్టు 31
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ,రెండవ తెలంగాణ రాష్ట్ర ఓపెన్ కుంఫు అదేవిధంగా.. కరాటే పోటీలను ఆర్గనైజర్ కె. రవీందర్ సీనియర్ కరాటే మాస్టర్ ఆధ్వర్యంలో ..పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా .. బెల్లంపల్లి ఏసిపి రవీందర్, మందమర్రి ఎస్సై రాజశేఖర్, గ్రాండ్ మాస్టర్ కంటేష్, సహాయక గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ, కోచ్ జెట్టి.కృష్ణ, ఏ సీ పి రవీందర్ లు హాజరై మాట్లాడుతూ.. నేడు సమాజంలో.. కుల ,మత, వర్ణ విభేదాలు లేని ఒకే ఒక్క మైదానము, అది క్రీడా మైదానమని చెప్పుకొచ్చారు. నేడు సమాజంలో ఎక్కడ చూసినా .. వర్గం,కులం , మతం , వర్ణం పేరుతోనే మానవ వ్యవస్థ నడుస్తుంది తప్పా..సమిష్టి అనేటువంటి పదాన్ని మర్చిపోయినటువంటి నేటి సమాజంలో .. క్రీడా.. రంగమే ఏకమై ముందుకు వెళ్లాలన్నారు. అంతేకాకుండా ..పిల్లలు మత్తు పదార్థాలకు బానిస కాకుండా.. క్రీడారంగాలపై ఆసక్తి చూపుతూ.. భవిష్యత్తులో ఇంకెన్నో బహుమతులు సాధించారంటూ.. కోరారు . ఈ పోటీలలో.. మందమర్రి పట్టణానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మాస్టర్ జెట్టి కృష్ణ సారథ్యంలో.. ప్రథమ స్థానంలో గెలుపొందినటువంటి విద్యార్థులు. కె .శాన్విత్ వర్మ, ఎం. అద్విక్, వి .తరుణ్ తేజ్, సమన్విత, విశ్వాని, వర్షిత్, సాయి, ద్వితీయ స్థానంలో. కార్తికేయ, విహాన్, శ్రీ వర్ధన్, విహాన్, అన్విత్, శశికాంత్, తృతీయ స్థానంలో. లక్ష్మీనరసింహ, నవీన్ తేజ, విశ్వతేజ విశ్వతేజ, రెస్వాంత్ వర్మ, హర్షిత్, విజేతలుగా నిలిచారు.









