జనం పవర్, జమ్మికుంట, ఆగస్ట్ 31:
జమ్మికుంట పట్టణంలోని 16 వార్డు ఎస్టీ కాలనీలో ఆదివారం ఎరుకల కులాస్తుల సమక్షంలో ఎరుకల జాతి ప్రజల ఆత్మగౌరవ పోరాట జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ 1952 ఆగస్టు 31 రోజున క్రిమినల్ ట్రైబ్స్(సీటి ఆక్ట్) అనే చట్టం రద్దు చేయబడిన దినాన్ని పురస్కరించుకొని ఎరుకల జాతి ప్రజల ఆత్మగౌరవ పోరాట జెండాను ఆవిష్కరించుకున్నామని,బ్రిటిష్ సామ్రాజ్య వాదుల దోపిడీలను మానసిక వైద్యులు అయినా ఎరుకల తెగలు పసిగట్టి తమ అడవి సంపదలను కొల్లగొట్టడానికి చేస్తున్న కుట్రలను తెలుసుకొని వారిపై బాణాలను ఎగ్గు పెట్టడానికి సిద్ధమైన సందర్భంలో ఎరుకల తెగలపై వారితో పాటు మిగతా తెగులపై క్రిమినల్ ట్రైబ్స్(సీటి ఆక్ట్) అనే నిర్బంధ చట్టాన్ని పెట్టి శారీరకంగా మానసికంగా హింసిస్తూ మా ఎరుకల జాతి ప్రజలు అంటేనే భయంకరమైనటువంటి తెగగా సమాజానికి తెలియజేసి అనేక అవమానాలకు గురి చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కుల పెద్దలు తిరుపతి సమ్మయ్య,రేవేల్లి బుచ్చయ్య,తిరుపతి రాజమౌళి, రేవేల్లి రాజయ్య,కేంసారపు తిరుపతి,కేతిరి సంజీవ్ కుమార్, లోకిని రాజయ్య,రేవేల్లి శ్రీనివాస్ లోకిని చిన్న రాజయ్య,శంకర్,రవి, వెంకటేష్,పల్లకొండ రాజ్ కుమార్, తిరుపతి ఎల్ల స్వామి,కుర్ర రాజు, యూత్ అధ్యక్షులు లోకిని రాజేష్,ఉపాధ్యక్షులు రేవేల్లి మహేష్, కోశాధికారి రేవేల్లి సతీష్, సంయుక్త కార్యదర్శి ఉండాది అనిల్,రేవేల్లి అంజి,ప్రచార కార్యదర్శి రేవేల్లి బాలు,కులస్తులు తదితరులు పాల్గొన్నారు.









