ఆరోగ్యానికి క్రీడలు అవసరం —సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్

జనం పవర్, భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 31:

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండపర్తి నరేష్ అన్నారు. కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో మీడియా లెవెన్, న్యాయవాదుల టీమ్ ఐ.ఎల్.పి.ఏ మధ్య జరిగిన ఫ్రెండ్స్ కప్ క్రికెట్ మ్యాచ్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మీడియా లెవెన్ జట్టు గెలుపొందిన న్యాయవాదుల ఐ.ఎల్.పి.ఏ జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా సిఐ నరేష్ మాట్లాడుతూ ప్రతీ పోటీల్లో గెలుపు ఓటములు సహజమని సమాజహితం కోసం నిరంతరం పని చేసే న్యాయవాదులు మీడియా ప్రతినిధులు ప్రొఫెషనల్ క్రీడాకారులుగా ఆడటం హర్షించదగ్గ విషయమన్నారు. ఐ.ఎల్.పి.ఏ.జట్టు క్రీడాకారులు ఓపెనింగ్ బ్యాటింగ్ చేసిన రాధాక్రిష్ణ, చిన్నికృష్ణ 58 పరుగులు జోడించడం కట్టుదిట్టమైన బౌలింగ్ ఫీల్డింగ్ చేయడం అభినందనీయమన్నారు. ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ టీం మీడియా లెవెన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐ.ఎల్.పి.ఏ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 162 పరుగులు చేయగా 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మీడియా లెవెన్ జట్టు 123 పరుగులు మాత్రమే చేయగా ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(ఐ.ఎల్.పి.ఏ) జట్టు 39 పరుగుల తేడాతో గెలుపొందారు.
ఈ కార్యక్రమంలో జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, న్యాయవాది యెర్రా కామేష్, న్యాయవాదులు జే.గోపికృష్ణ, సాదిక్ పాషా, మారపాక రమేష్, చిన్ని క్రిష్ణ, దారావత్ రాధాకృష్ణ, వడ్లకొండ హరి, సామంత్, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :