లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యవర్గ సమావేశంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాదావత్ శ్రీనివాస్ నాయక్.

 

జనం పవర్, జన్నారం,ఆగష్టు 31:

లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసేయాలని సుప్రీం కోర్టుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, కాంగ్రెస్ నాయకుడు సోయం బాపురావు, చర్యలను లంబాడీల మీద కాంగ్రెస్ చేస్తున్న కుట్రలుగా పరిగణిస్తున్నాము… రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో లగచర్లలో లంబాడీ మహిళల మీద అఘాయిత్యాలు మరువకముందే మళ్ళీ లంబాడీల మీద కొత్త కుట్ర తెరమీదకు తేవడం రాష్ట్రంలోని 60 లక్షల మంది లంబాడీల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా లంబాడీల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను పార్టీలకు అతీతంగా ధీటుగా ఎదుర్కుంటాం… మా హక్కులను మేము కాపాడుకుంటాం ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం మా బంజారా సోదరుల జోలికి వస్తే ప్రభుత్వం లేకుండా చేస్తాం.
లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ బాదావత్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు అజ్మీరా బద్రీనాథ్ బాబూలాల్ నాయక్ శ్రీను నాయక్ సాయి కిరణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :