*బాసర ఆలయ ప్రత్యేక అధికారిగా భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్…*

 

*జనం పవర్,బైంసా,ఆగస్టు 31:*

తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారీ ఆలయ స్పెషల్ అధికారిగా భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ ను నియమిస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత రెండు సంవత్సరాలుగా వస్తున్న ఇతరత్రా ఫిర్యాదుల నేపథ్యంలో బాసర ఆలయ ప్రతిష్ట, భక్తుల నిత్యావసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ఓ ప్రకటన జారీ చేశారు. ఆలయానికి ప్రత్యేక అధికారి లేకపోవడంతో ఆలయ అభివృద్ధి కుంట పడుతుందన్నారు. కీసరగుట్ట ఈవో సుధాకర్ రెడ్డి బాసర ఆలయ ఇన్చార్జి ఏవో గా కొనసాగనన్నారు.ఆదివారం నుంచి సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ వీధులాల్లో జాయిన్ కానున్నారు. రానున్న నవరాత్రి నేపథ్యంలో కలెక్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హర్షినియమని భక్తులంటున్నారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :