*నిర్మల్ జిల్లా విద్యాధికారిగా భోజన్న..*

 

*జనం పవర్,బైంసా,ఆగస్టు 31:*

నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారిగా భోజన్న నియమితులయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీఈవో రామారావు స్వచ్ఛంద పదవి విరమణ పొందిన నేపథ్యంలో ఈ నియమకం జరిగింది. భోజన్న ప్రస్తుతం జనగామ జిల్లా విద్యాశాఖ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తూ అదనపు బాధ్యతల నియామకం కింద నిర్మల్ డీఈవోగా నియమితులయ్యారు. నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ ప్రాంతానికి చెందిన భోజన్న గతంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సూపర్డెంట్ గా పనిచేశారు.కాగా ఆయన ఆదివారం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను కలిసి బాధ్యతలు చేపట్టనున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :