వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

 

జనం పవర్, జన్నారం, ఆగష్టు 31:

జన్నారం: వరద బాధితులను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆదుకుంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తెలిపారు. కుండపోత వానలతో అతలాకుతలమైన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఆదివారం ఆమె పర్యటించారు. తిమ్మాపూర్, రాంపూర్, తపాలాపూర్, తదితర గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి బాధితులతో మాట్లాడారు. ప్రజలతో సమావేశామై వాళ్ల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇండ్లు కూలిపోయినోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు, దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందజేస్తామని చెప్పారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం జిల్లాకు రూ. కోటి చొప్పున సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారు. వర్షాల వల్ల ఇండ్లు కూలిపోయినోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. సుగుణక్క వెంట నాయకులు చిందం చంద్రయ్య, ప్రదీప్,కోవా శాంతయ్య,గుగులావత్ రవి, కనక వెంకటేష్, గుండా లచ్చయ్య, కోవా భూమయ్య, శంకరయ్య, జాడి రాజన్న, గోలకొండ రాజన్న, దాసరి వెంకటేష్, చిందం ముత్తయ్య, తపలాపూర్ గ్రామ అధ్యక్షుడు సత్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్ నర్సయ్య, మామిడి శ్రీనివాస్, సత్తయ్య, ఉప్పు సత్తయ్య, పద్మారావు, సురక్ష తదితరులు ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :