జనం పవర్ మాడుగులపల్లి ఆగస్టు 31;
మాడుగులపల్లి మండలంలోని కేశవపురం(పెద్దపాడు) గ్రామంలో ఒకే ఊరు ఒకే విగ్రహాన్ని గత 30 సంవత్సరాలుగా ఊరు ఆనవాయితి ప్రకారం ఓకే వినాయకుని ప్రతిష్టించడం జరుగుతుంది. వినాయక చవితి వచ్చిందంటే ఊరంతా గల్లి గల్లి లో విగ్రహాలను ఏర్పాటు చేసే ఈ కాలంలో కేశవపురం(పెద్దపాడు) గ్రామంలో ఊరు ప్రజలు అంత కలిసి ఒకే చోట ఓకే వినాయకుడిని ప్రతిష్ఠించి కులమతాలకు అతీతంగా పూజి స్తారు.నవరాత్రుల్లో గ్రామస్థులంతా రాత్రి భజనలు, కోలాటం వేస్తారు. కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం వంటి తేడాలు లేకుండా గ్రామ ప్రజలు దాతలుగా ముందుకు వచ్చి రామాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాలను నిర్మించారు. విగ్రహ నిమజ్జనం రోజు బ్యాండ్ బాజాలు డీజేలు వంటివి పెట్టకుండా ఊరు ఊరంతా డప్పు చప్పులతో కోలాట, భజన బృందాలతో సాగనంపుతారు.
Post Views: 39









