అసెంబ్లీలో ఆసుపత్రుల గురించి మాట్లాడిన కోరుట్ల ఎమ్మెల్యే…

జనం పవర్. మెట్ పల్లి. ఆగస్టు 31:
అసెంబ్లీ సమావేశాల్లో కోరుట్ల లో 100 పడకల ఆసుపత్రి సమస్యలు తీర్చాలని, మరియు ఆసుపత్రి ప్రారంభించి రెండు సంవత్సరాలు అయినా, సరిపోయినంత స్టాప్ లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారని, కావున ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ ఆసుపత్రులు బలపరుచుకోవాలని తెలియజేశారు. మరియు మెట్టుపల్లి ఆసుపత్రి కూలిపోయేటట్టు ఉందని ఆరోగ్య మంత్రి గారిని అడిగితే మంత్రిగారు పనులు చేయాలని అధికారులను ఆదేశించారు కానీ పనులు కాలేదు. ఈరోజు పొద్దున నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. ఆరోగ్యశ్రీ బిల్లును కనీసం ఇవ్వట్లేదని మంత్రిగారిని అడిగితే సమస్య తీర్చాలని అధికారులను ఆదేశిస్తారు. కానీ పనులు కావట్లేదు. ప్రాబ్లం ఎక్కడ ఉందో ప్రభుత్వం ఆలోచించాలని. అదేవిధంగా ఆశా వర్కర్స్ కి 2500 వేల జీతాన్ని 10 వేలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ,ఆశా వర్కర్స్ తో గ్రౌండ్ లెవెల్ లో వారితో పని చేయించుకుంటాం కాబట్టి వాళ్లకి జీతం పెంచాలని, అన్ని పనులు తొందరగా అయ్యే విధంగా చూడాలని కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :