మహిళా మోర్చా నాయకుల అరెస్ట్

 

జనం పవర్, వనపర్తి, ఆగష్టు 31 :

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ఆదేశానుసారం మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఆదేశానుసారం బెంగాల్ లోని దార్బాలో ఓటర్ మీటింగులో కాంగ్రెస్ కార్యకర్తలు భారత దేశ ప్రధానమంత్రి ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ ను అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హైదరాబాద్ లో నిరసన కార్యక్రమం ఉన్నందున వనపర్తి నుంచి మహిళా మోర్చా కో ట్రెజరర్ నారాయణదాసు జ్యోతి రమణ అదివారం హైదరాబాద్ వెళ్తుందని ముందస్తుగా వనపర్తి టౌన్ పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోవడం జరిగింది. ఈ ఈ సందర్భంగా నారాయణదాసు జ్యోతి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ తల్లిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నరేంద్ర మోడీకి బిజెపి కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని , రాబోయే రోజుల్లో భారత దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు తమ ఓటుతో బుద్ధి చెబుతారని అన్నారు, పోలీసుల అరెస్టు చేసిన వారిలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అలివేలమ్మ , జిల్లామహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుగురు లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షురాలు సుమిత్రమ్మ, జిల్లా కార్యదర్శి సరోజ, ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :