జనం పవర్,జుక్కల్ ప్రతినిధి దయానంద్ ఆగస్టు 31 :
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా పలు గణేష్ మండపాలైన ఆర్యవైశ్య సంఘం గణేష్ మండలి,శాంతి మున్నూరు కాపు సంఘం గణేష్ మండలి,శ్రీ మార్కండేయ పద్మశాలి గణేష్ మండలి,యువ చైతన్య గణేష్ మండలి, గుమస్తా సంఘం గణేష్ మండలి, కాశీ విశ్వనాథ్ గణేష్ మండలి,శివపుత్ర గణేష్ మండలి, బసవేశ్వర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో సంఘం సభ్యులు ఆదివారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.వచ్చిన భక్తులకు మహా అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గణేష్ ఆశీర్వాదాలు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత సంఘం సభ్యులు తెలిపారు.

Post Views: 131









